ఏమని వర్ణింతు - నీ కృపను
యేరులై పారెనే - నా గుండెలోన
సర్వోన్నతుడా నీ సన్నిధిలో
బలము పొందిన వారెవరైనా
అలసిపోలేదెన్నడును…
పక్షిరాజువలెను నా గూడు రేపి
నీ రెక్కలపై మోసితివే
నీ కృప నాపై చూపుటక
మరణము నశియింప చేయుటకేనా
కృపాసత్యసంపూర్ణుడవై
మా మధ్యన నివసించితివా…