నిత్యుడా నీ సన్నిధి - నిండుగా నా తోడు
నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము
నీ కుడి హస్తం - హత్తుకొనియున్నది
నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది
నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా
నీ సన్నిధిలో నా హృదయమును
నీళ్ళ వలెను కుమ్మరించునట్లు
నీ పాదపీఠముగా నన్ను మార్చుమా
నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనసునందు నన్ను తలంచితివా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా