తేజోవాసుల స్వాస్థ్యమందు
నన్ను చేర్చుటే - నీ నిత్యా సంకల్పమా
అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా
రాబోవు యుగములన్నిటిలో - కృపామహదైశ్వర్యం
కనుపరచె నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా
శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము
శాప విముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా