యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
నా అడుగులు జార సిద్ధమాయెను
అంతలోన నా ప్రియుడు - నన్ను కౌగలించెను
అగాధ జలములలోనా - అలుమటించు వేళా
జాలి వీడి విడువక - నన్ను ఆదరించెను
అడవి చెట్లలోనా - జల్దరు వృక్షంబువలె
పురుషులలో నా ప్రియుడు - అధిక కాంక్షణీయుడు