నా ప్రియుడు యేసు నా ప్రియుడు
నా ప్రియునికి నే స్వంతమేగా
నా ప్రియుడు నా వాడు
మరణపు ముల్లు నాలో విరచి
మారాను మధురముగా చేసి
మనస్సును మందిరముగ మార్చె
కృపనే ధ్వజముగా నాపై నెత్తి
కృంగిన మదిని నింగికెత్తి
కృపలో పరవశమొందించె
సంఘముగా నన్ను చేర్చుకొని
సంపూర్ణ నియమములన్నియును
సంగీతముగా వినిపించె
జీవితమే జలరేఖలుగా
చెదరిన సమయములన్నిటిలో
పిలుపును స్థిరపరచే కృపలో
సంబరమే యేసు కౌగిలిలో
సర్వాంగసుందరుడై వచ్చువేళ
సమీపమాయె ఆ శుభవేళ