యుద్ధవీరులం - మనము యుద్ధవీరులం
మహిమాత్మను పొందిన - ప్రార్థనా వీరులం
భయపడము జడియము
అపవాదిని ఎదిరించె - ఆత్మ ఖడ్గ యోధులం
కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది - బానిసలు కాలేదు
బలహీనతలో - మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచియుండగా
విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును - యేసు వలన పొందాము
సర్వాంగ కవచమును - ధరించుకొనియున్నాము
స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా
హోసన్నా...హోసన్నా...హోసన్నా యోధులమై సాగిపోదము...