ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపము - నాలో రూపించుటకా?
ఇదియే నా యెడ - నీకున్న నిత్య సంకల్పమా?
(సిలువపై శ్రమలలో) శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా...
శిలనైనా నన్ను - నీ వలె మార్చుటకా...
శిల్పకారుడా! నా యేసయ్య
మలుచుచుంటివా - నీ పోలికగా...
తీగలు సడలి - అపస్వరములమయమై
మూగబోయెనే - నా స్వరమండలము
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా - పలికించితివా...
ఏమియ్యగలనయ్యా - నీ దివ్య సేవకు