శ్రీమంతుడా! యేసయ్య
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా...
సిలువ దారి - నా బలిపీఠమా
నీ రక్తపు కోట - నాకు నివాసమా
నన్ను నీవు పిలిచిన - పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ - సంకేతమా...
మహిమగల పరిచర్య - పొందినందున
అధైర్యపడను - కృపపొందినందున
మహిమతో నీవు - దిగివచ్చు వేళ
మార్పునొందెద - నీ పోలికగా...
సీయోను శిఖరము - సింహాసనము
వరపుత్రులకే - వారసత్వము
వాగ్ధానములన్ని - నెరవేర్చుచుంటివా
వాగ్ధానపూర్ణుడా - నా యేసయ్య