యెడబాయని నీ కృపలో - నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో - నన్ను నిలిపిన నా ప్రభువా
నీకేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు
నశించిపోయే నన్ను నీవు - ఎంతో ప్రేమతో ఆదరించి
నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా - రక్షణ భాగ్యము నొసగితివే
నీకేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు
అనుదినము నీ ఆత్మలోనే - ఆనందమోసగిన నా దేవా
ఆహా... రక్షక - నిన్ను స్తుతించెద - ఆనంద గీతమునే పాడి
నీకేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు