ఆనందింతు నీలో దేవా - అనుదినం నిన్ను స్తుతించుచు
మధురమైన నీ నామమునే - మరువక ధ్యానించెద ప్రభువా
ఆత్మనాధ - అదృశ్య దేవా - అఖిలచరాలకు ఆధారుఁడా
అనయము నిన్ను మది కొనియాడుచునే - ఆనందింతు ఆశతీరా
నాదు జనములు నన్ను విడచినను - నన్ను నీవు విడువకుండ
నీ కనుదృష్టి నాపైనుంచి - నాకు రక్షణ శృంగమైన
శ్రేష్ఠమగు నీ స్వస్థము కొరకై - మేఘమందు రానైయున్న
ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు - అంతం వరకును భద్రపరచుము