అగ్ని మండించు - నాలో అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు... నాలో అగ్ని మండించు
అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా
ఆ అగ్నిలోనుండే - నీవు మోషేను దర్శించినావే
అగ్ని కాల్చివేసేనే - సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే
అగ్ని కానరానందున - వారు సిగ్గుపడిపోయిరే
నీ అగ్ని దిగి రాగా - నీవు ఏలియాను ఘనపరచినావే
ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించుచున్నానయ్యా
నీ ఆత్మ వరములతో - నన్ను అలంకరించుమయ్యా