నా దీపము - యేసయ్య నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా - జడివానలోనైనా
ఆరిపోదులే - నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము
ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై - దీపాల తోరణమై
చేసావు పండుగ - వెలిగావు నిండుగా
మారని నీ కృప - నన్ను వీడనన్నది
మర్మాల బడిలోన - సేదదీర్చుచున్నది
మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా
ఆగని హోరులో - ఆరిన నేలపై
నా ముందు వెలసితివే - సైన్యములకధిపతివై
పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా