యెహోవాయే నా కాపరిగా
నాకేమి కొదువగును
పచ్చికగల చోట్లను - నన్నయనా పరుండజేయును
శాంతియుతమైన జలములకు - నన్నయనే నడిపించును
గాఢాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
నీ దుడ్డుకర్రయు - నీ దండమును - నా తోడైయుండి నడిపించును
నా శత్రువుల ఎదుట నీవు - నా భోజనము సిద్ధపరచితివి
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లుచున్నది
నా బ్రతుకు దినములన్నియును - కృపాక్షేమాలే వెంటవచ్చును
నీ మందిరములోనే చిరకాలము - నివాసము చేయనాశింతును